జెర్సీ బిజినెస్ ఎంత చేసిందంటే.. నాని సత్తా చాటాడుగా..!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మించగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈమధ్యనే రిలీజైన జెర్సీ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా జెర్సీ అదరగొడుతుంది.

పదేళ్ల క్రితం క్రికెట్ మానేసి 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడాలనుకునే వ్యక్తి కథే ఈ జెర్సీ. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్నిటిలో ఎమోషనల్ గా సినిమాపై ఓ మంచి ఫీలింగ్ ఏర్పరచిన జెర్సీ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతున్న ఈ సినిమా 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఏరియాల వారిగా జెర్సీ బిజినెస్ డీటైల్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం : 10 .00 కోట్లు

సీడెడ్ : 3.20 కోట్లు

కృష్ణ : 1.45 కోట్లు

గుంటూరు : 1.80 కోట్లు

నెల్లూరు : 0.80 కోట్లు

ఈస్ట్ : 1.60 కోట్లు

వెస్ట్ : 1.25 కోట్లు

ఏపీ/తెలంగాణ : 20.10 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.90 కోట్లు

ఓవర్సీస్ : 4.00 కోట్లు

వరల్డ్ వైడ్ : 26.00 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version