అర్దరాత్రి హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ షికారు…!

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ మీదున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ షూటింగ్‌లో బిజీగా గడిపేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన పూరి.. విజయ్‌తో ప్యాన్ ఇండియా మూవీని ప్లాన్ చేశాడు.

ఫైటర్ మూవీ కోసం విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. థాయ్‌లాండ్ వెళ్లి మరీ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైయిన్ అయి వచ్చాడు. తనలో చాలా మార్పులు వస్తాయని, ఇక నుంచి రాబోయే చిత్రాలన్నీ కొత్తగానే ఉంటాయని ఆ మధ్య చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్టే విజయ్ బాడీలోనూ మార్పులు వచ్చేశాయి. విజయ్ సరసన బాలీవుడ్ హాట్ భామ అనన్య పాండేను తీసుకున్నారు. మొదటగా ఈ పాత్రకు జాన్వీ కపూర్‌ను తీసుకుందామని అనుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు కానీ అటు వైపు నుంచి స్పందన రాకపోయే సరికి అనన్య పాండేను ఎంచుకున్నారు.

పూరీ సినిమా అంటే రొమాన్స్ ఎంత ఘాటుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. పూరీ చూపించే రొమాంటిక్ ట్రాక్‌కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తాజాగా విజయ్-అనన్యపైనా ఓ రొమాంటిక్ ట్రాక్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ బైక్ రైడ్ చేస్తుండగా.. అనన్య ముందూ వెనకా కూర్చొని పిచ్చెక్కిస్తుంది. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news