బ్రేక్ డాన్స్ తో అదరగొట్టిన అయ్యన్న పాత్రుడు.. వైర‌ల్ వీడియో..!!

-

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు.. యాంకర్లతో కలిసి ‘ఎల్లువోచ్చి గోదారమ్మ..’ పాటకు వేసిన స్టెప్పులు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఈయ‌న రెండో కుమారుడు రాజేష్ వివాహం విశాఖపట్నంలో వైభవంగా జరుగగా.. రిసెప్షన్ కార్యక్రమం ఎంతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా బంధువులంతా ఆడిపాడారు. అయితే అయ్యన్న కూడా తనలో డ్యాన్సింగ్ టాలెంట్ బయటపెట్టారు.

ఇద్దరు యాంకర్లు దేవత సినిమాలోని `ఎల్లువోచ్చి గోదారమ్మ..` పాటకు స్టెప్పులేస్తుండగా, అయ్యన్నపాత్రుడు, శోభన్ బాబు మాదిరిగా త‌న‌వంతు స్టెప్పులేసి అద‌ర‌గొట్టారు. లయబద్ధంగా ఆయన డ్యాన్స్ వేస్తుంటే, చుట్టూ ఉన్నవారంతా అరుపులు, కేకలతో హోరెత్తించారు. ఆపై తన బంధు మిత్రులతో కలిసి ‘గున్నా గున్నా మామిడి…’ పాటకు కూడా ఆయన మాస్ స్టెప్పులు వేసి ఇర‌క‌దీశారు. మ‌రియు ఇదే వీడియోలో నూతన వధూవరులు డ్యాన్స్ చేశారు. ఇటీవలి సూపర్ హిట్ చిత్రం సరిలేరు నీకెవ్వరు నుంచి ‘హీజ్ సో క్యూట్’ పాటకు కూడా యాంకర్లు బంధువుల‌చే డ్యాన్స్ వేయించారు.

అయితే ప్ర‌స్తుతం ఈ మాజీ మంత్రి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అయ్యన్నలో డ్యాన్సింగ్ టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, అయ్యన్న కుమారుడి వివాహానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లాల్సి ఉంది.. కానీ విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లడంతో పెళ్లికి హాజరు కాలేకపోయారు. దీంతో నూతన వధూవరులకు ట్విట్టర్ ద్వారా చంద్ర‌బాబు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news