నేషనల్ క్రష్ రష్మిక మందన, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నారు. వారు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గీతా గోవిందం సినిమాలో కలిసిన నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, ఒకరి బర్త్డే ను మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం ఒకరి దుస్తులు మరొకరు ధరించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే రష్మిక, విజయ్ దేవరకొండ కొద్ది రోజుల క్రితమే వారి ప్రేమ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో వారు తొందర్లోనే వివాహం చేసుకోవాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ సాంప్రదాయ దుస్తులలో వివాహం చేసుకున్నట్లుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమైన ఫోటో కాదని ఏఐ ఫోటోలు అని కొంతమంది తేల్చి చెబుతున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటే అందరికీ తెలిసేలా చేసుకుంటారు ఇంత సీక్రెట్ గా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఈ ఫోటోలపైన రష్మిక, విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.