ప్రభాస్ సినిమాలో విజయ్ దేవరకొండ?

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’ మూవీ ఏడాది మే 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు.

Vijay Deverakonda in Prabhas movie

అయితే.. ‘కల్కి 2898AD’ సినిమా గురించి టీటౌన్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘సలార్’ తో సక్సెస్ అందుకున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ తో కలిసి ‘కల్కి 2898AD’ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిధి పాతలో నటిస్తున్నారట. షూటింగ్ లోను పాల్గొంటున్నట్లు టాక్. కాగా,ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే , దిశా పటానీ, లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది .ఈ మూవీని సీ అశ్వనీదత్‌ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news