వామ్మో.. హీరోయిన్‌ను ఎక్కడ పట్టుకున్నాడో చూడండి!!

-

పూరీ జగన్నాథ్ సినిమాలంటేనే ఓ వర్గానికి పిచ్చి. యూత్‌లో ఆయనకు, ఆయన తీసే సినిమాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలను చూపించే విధానం, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఇలా ప్రతీ దాంట్లో ఆయన మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. బ్రది సినిమాతో మొదలు కొని నిన్న మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ వరకు అంతే.. హీరోయిన్ల క్యారెక్టర్, రొమాన్స్ కాస్త ఘాటుగానే ఉంటుంది.

పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందో. ఈ మూవీ కోసం విజయ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. థాయ్‌లాండ్‌లో దాదాపు నెల రోజుల పాటు కఠోర శిక్షణ అనంతరం..గత నెలలో ముంబైలో షూటింగ్ ప్రారంభించారు. ఇప్పటికే లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా అర్దరాత్రి నడిరోడ్ల మీద బైక్ రొమాన్స్.. చక్కర్లు కొడుతూ షికారు చేశాడు. వీటికి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేశాయి. తాజాగా తన రొమాన్స్‌ను సముద్రంలోకి షిఫ్ట్ చేసినట్టు కనిపిస్తోంది. బోట్‌లో హీరోయిన్ నడుముపై మొహం వాలుస్తూ వయ్యారంగా చేతులేసి పట్టుకున్నాడు. ఇక ఈ ఫోటో చూస్తుంటే పూరి.. ఇసారి రొమాన్స్‌పై ఇంకాస్త శ్రద్ద ఎక్కువ పెట్టినట్టు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news