Jana Nayagan : విజయ్ చివరి సినిమా రిలీజ్ డేట్ ఇదే

-

కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే.  ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) స్థాపించి, 2026 ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించాడు. అయితే చివరగా ‘జన నాయగన్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా మేకర్స్ జననాయగన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. విజయ్ కెరీర్‌లో ఇది 69వ చిత్రం కావడంతో పాటు, ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే ముందు చివరి సినిమా కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ రాజకీయ ఆలోచనలను ప్రతిబింబించే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news