హైదరాబాద్‌లో విజయ్-ప్రశాంత్ కిశోర్ రహస్య సమావేశం !

తమిళ్‌ హీరో విజయ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజయ్‌ కి.. తమిళంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్‌ ఉంది. అయితే.. విజయ్‌ ప్రస్తుతం తమిళ రాజకీయాలపై ఫోకస్‌ చేసినట్లు సమాచారం అందుతోంది. గతంలో హీరో విజయ్‌ ని కేంద్ర బీజేపీ టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. విజయ్‌ ఇంటిపై ఐటీ దాడులు ఇందులోని భాగమే.

ఇక అప్పటి నుంచి విజయ్‌.. పొలికల్‌ ఎంట్రీ పై దృష్టి సారించారు. అందులో భాగంగానే… ఇటీవలే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తో హీరో విజయ్‌ సమావేశం అయినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్‌ లోని ఓ విల్లాలో వీరిద్దరూ సమావేశం జరిగిందట. ఈ సమావేశంలో.. తమిళ నాడు రాజకీయాలపై చర్చ జరిగిందని టాక్‌ వినిపిస్తోంది. తానే స్వంతంగా పార్టీ పెడితే.. వచ్చే సమస్యలు, ఎదురీతల గురించి.. ప్రశాంత్‌ కిషోర్‌ తో విజయ్‌ చర్చించారట. రజీనికాంత్‌ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పాడు కాబట్టి.. ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని విజయ్‌ అనుకుంటున్నాడట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.