జపాన్ భూకంపం: నలుగురు మరణం, 97 మందికి గాయాలు… పట్టాలు తప్పిన బుల్లెట్ ట్రైన్

-

జపాన్ లో నిన్న సంభవించిన భూకంపం ధాటికి చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. నిన్న రాత్రి జపాన్ తూర్పు ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 7.3 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. రాజధాని టోక్యోకు ఈశాన్యంగా 297 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర గర్భానికి 60 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించారు. ఈ భూకంపం వల్ల చాలా ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు ముందుగా అప్రమత్తం అయి సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఈ భూకంపం ధాటికి 4 గురు చనిపోగా… 97 మందికి గాాయాలయ్యాయి. భూకంపం ధాటికి అత్యంత సురక్షితం అయిన షెంకన్ పెన్ బుల్లెట్ రైలు మియాగి ప్రిఫెక్చర్ లో పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

గతంలో 2011 లో జపాన్ లో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని వల్ల సునామీ కూడా వచ్చింది. ఫుకుషిమా ప్రాంతంలో ఈ భూకంపం రావడం వల్ల అక్కడ అణువిద్యుత్ కేంద్రం దెబ్బతింది. అణు ఇంధనం లీక్ అయింది. అయితే తాజాగా మళ్లీ నిన్న ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news