విజయ్ రెమ్యూనరేషన్‌ను బయటపెట్టిన ఐటీ శాఖ

-

తమిళనాట దళపతిగా ఎనలేని క్రేజ్, అంతులేని అభిమాన గణాన్ని మూటగట్టుకున్న హీరో విజయ్. తమిళ సూపర్ స్టార్ రజినీ తరువాత అంతటి స్థాయిని, అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో చుట్టూ నిత్యం వివాదాలే ఉంటాయి. ఈయన తీసే సినిమాలు, చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగానే ఉంటాయి. అందుకే ఇతగాడి సినిమాలకు తమిళనాట ఫుల్ క్రేజ్.

విజయ్ సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన బిగిల్ (తెలుగులో విజిల్) తమిళ నాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ నిర్మాత అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో భాగంగా విజయ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అప్పట్లో ఈ దాడులు సంచనంగా మాారాయి.

మరోసారి తాజాగా విజయ్ ఇంట్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో విజయ్ రెమ్యూనరేషన్‌ను బయటపెట్టింది. బిగిల్ చిత్రానికి గానూ రూ.50కోట్లు, మాస్టర్ చిత్రానికి గానూ రూ. 80కోట్ల రెమ్యూనరేషన్‌ను తీసుకున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు విజయ్ పన్నులు చెల్లించాడని క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో విజయ్ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version