బిగ్‌బాస్‌ హోస్ట్‌గా విజయ్‌ సేతుపతి!

-

రియాల్టీ షోల్లో రారాజు బిగ్ బాస్. ఇప్పటికే ఈ షో వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతోంది. చాలా భాషల్లో డజనుకుపైగా సీజన్లు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయా భాషల్లోని స్టార్ హీరోలు హోస్టులుగా వ్యవహిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తమిళ్కు ఇప్పటివరకు స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ హోస్టుగా వ్యవహరించారు. అయితే తనకున్న వర్క్ కమిట్మెంట్స్ వల్ల రాబోయే రోజుల్లో బిగ్బాస్కు టైం కేటాయించలేనని ఆయన ఇటీవలే చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తమిళ బిగ్బాస్ రానున్న సీజన్కు హోస్టు ఎవరనే దానిపై చర్చ మొదలైంది.

ఈ క్రమంలోనే తాజాగా స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి పైరు తెరపైకి వచ్చింది. తమిళ బిగ్‌ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి టీజర్ కూడా రెడీ అయిందట. ఇక ఇప్పటికే విజయ్‌ సేతుపతి హోస్టుగా అలరించిన విషయం తెలిసిందే. సన్‌ టీవీలో ప్రసారమవుతున్న ‘మాస్టర్‌ చెఫ్‌’తో పాటు మరో కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బిగ్‌ బాస్‌ వేదికపై కూడా సందడి చేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news