లగ్జరీ హౌస్ ను సొంతం చేసుకున్న విజయ్.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్..!

-

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది ఇండస్ట్రీలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఈయన కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక విజయ్ కి కూడా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.. ఇక ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమాను డైరెక్ట్ గా తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో హీరోయిన్గా రష్మిక నటిస్తున్నది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ దళపతి గురించి కోలీవుడ్ మీడియా నుంచి బాగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం.

విజయ్ దళపతి భారీ ధరను చెల్లించి ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా చెన్నై నగరంలోని ఖరీదైన ప్రాంతాలలో ఆ లగ్జరీ అపార్ట్మెంట్ ని తీసుకున్నట్లు సమాచారం. దీని ధర సుమారుగా రూ.32 కోట్ల పై మాటే అన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ ఈస్ట్ కోస్ట్ రోడ్డు ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇక అక్కడ ఎప్పుడూ చాలా రద్దీగా ఉండడంతో కొత్త ఇల్లునే కొనుక్కోవాలి అని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.అందుచేతనే ఒక భారీ మొత్తాన్ని చెల్లించి ఒక అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఇక ఈ హీరో ఉంటున్న అపార్ట్మెంట్ లోనే మరొక స్టార్ హీరో ఆర్య కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వారసుడు సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు విజయ్ దళపతి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ కొన్న ఆ అపార్ట్మెంట్ ధర వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version