మ‌రోసారి నిరాశ ప‌రిచిన విజ‌య్‌.. అస‌లు కార‌ణం ఇదే!

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా లేట్ అయినా..క‌నీసం టీజ‌ర్ అయినా విడ‌ద‌ల చేస్తార‌ని అంతా భావించారు. ఇందుకు విజ‌య్ కూడా త‌న బ‌ర్త్‌డే రోజు స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని తెలిపాడు. దీంతో ఆయ‌న అభిమానులు ఎంతో ఎదురుచూసినా.. చివ‌ర‌కు నిరాశే మిగిలింది.

విజ‌య్‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న సినిమా లైగ‌ర్‌. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ముంబ‌యి, హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో దీన్ని తీస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది.

అయితే మే9న విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీజ‌ర్ విడుదల‌వుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ క‌రోనా క‌రాణంగా విడ‌ద‌ల చేయ‌ట్లేద‌ని మూవీటీం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అంద‌రూ ఇంట్లోనే ఉండాల‌ని, ఇలాంటి టైమ్‌లో టీజ‌ర్ రిలీజ్ చేస్తే అభిమానులు బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని, అందుకే విడ‌ద‌ల చేయ‌ట్లేద‌ని తెలిపింది. కాగా ఈసినిమాను సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.