ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన భారత మాజీ కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకుని ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ లలో ఒకరిగా చలామణి అవుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మైదానం వెలుపల అతని జీవితాన్ని అతని అభిమానులు బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో భాగంగానే విరాట్ కోహ్లీ దగ్గర ఎంత ఆస్తి ఉంది.. ఎన్ని కోట్లకు ఆస్తిపరుడు అని ప్రతి విషయం కూడా తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ను వివాహం చేసుకోక ముందు ఈయనకు ఏకంగా రూ.980 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లాగే విరాట్ కోహ్లీ కి కూడా కార్లు అంటే విపరీతమైన అభిమానట. అందుకే తన కార్ గ్యారేజ్ లో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉన్నట్లు సమాచారం. ఈరోజు వాటి ధరలు గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం.
1. బెంట్లీ కాంటినెంటల్ GT:
2018 లో విరాట్ కోహ్లీ తన సోదరుడు వికాస్ పేరిట బ్లెంటీ కాంటినెంటల్ GT కారును కొనుగోలు చేశారు. ఇక కోహ్లీ ఢిల్లీ లో ఉన్నప్పుడు వైట్ కలర్ లగ్జరీ కాంటినెంటల్ కార్ ను ఉపయోగిస్తారు. దేశంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారు ఇది . దీని ధర రూ.3.294.04 కోట్లు.
2. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్:
మన దేశంలో అత్యంత విలాసవంతమైన కార్లలో ఇది కూడా ఒకటి ముఖ్యంగా ఇది 1818 అనే ఫ్యాన్సీ నెంబర్ తో రిజిస్టర్ చేయబడింది. ఫ్లయింగ్ స్పర్ శక్తివంతమైన కారు 6.0 లీటర్ W12 ఇంజన్ తో శక్తిని అందిస్తుంది ఇక దీని గరిష్ట వేగం గంటకు 333 కిలోమీటర్లు. ఇక ఈ అందమైన కారు ధర రూ.1.703.41 కోట్లు.
ఇక వీటితో పాటు ఆడి క్యూ సెవెన్ – రూ.70 లక్షలు, ఆ డి ఆర్ ఎస్ 5 – రూ.1.1 కోట్లు, ల్యాండ్ రోవర్ వోగ్ – రూ.2.26 కోట్లు.