బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. ఇద్దరికి సోషల్ మీడియా లో ఫాలోయింగ్ చాలా నే ఉంటుంది. అయితే అమితాబ్ బచ్చన్ మాత్రం ఇప్పటి వరకు కేవలం ట్విట్టర్ లో నే యాక్టివ్ గా ఉండే వాడు. కానీ విరాట్ కోహ్లి మాత్రం ట్విట్టర్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ లో కూడా సూపర్ యాక్టివ్ గా ఉంటాడు. అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజా గా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేశాడు.
ఈ సందర్భం గా విరాట్ కోహ్లి ని తన కంటే బిగ్ అంటూ కామెంట్ చేశాడు. తనకు ఇన్ స్టా గ్రామ్ లో కేవలం.. 29 మిలియన్ల ఫాలోయర్స్ మాత్రమే ఉన్నారని అన్నారు. కానీ విరాట్ కు 160 మిలియన్ల ఫాలోయర్స్ తో అగ్ర స్థానం లో ఉన్నారని అన్నారు. అలాంటి వ్యక్తి.. తన కంటే గొప్ప అని బిగ్ బి అన్నాడు. అంతే కాకుండా.. తాను టక్సిడో ధరించి ఇంత అందం గా ఉన్నా.. విరాట్ కోహ్లి ని నిలవరించ లేక పోతున్నానని అన్నారు.