విరూపాక్ష -2: క్లారిటీ ఇచ్చిన సాయి ధరంతేజ్..!

-

కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం విరూపాక్ష. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ పొందుతోంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే మంచి విజయం సొంతం చేసుకుంది అంటే కచ్చితంగా ఆ సినిమాకి పార్ట్ 2 ఉండాలని అభిమానులు కోరుకుంటూ వుంటారు. ఈ క్రమంలోనే విరూపాక్ష 2 కూడా ఉంటుందా అని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాలిడ్ రిప్లై ఇచ్చారు సాయి ధరంతేజ్.

ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లో కళ్ళు చెదిరే వసూలతో సత్తా చాటింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పై సంతోషం వ్యక్తం చేస్తున్న చిత్రం యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సినిమా సక్సెస్ తో సాయి ధరంతేజ్ పూర్తి హ్యాపీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో ముచ్చటించాడు. అందులో భాగంగానే విరూపాక్ష 2 మూవీ పై ఒక అభిమాని ప్రశ్నించగా ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టుగా సినిమాలోనే హింట్ ఇచ్చాము కదా అంటూ తేజు తెలిపాడు. విరూపాక్ష 2 కూడా ఉండబోతోంది అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికైతే విరూపాక్షతో ప్రేక్షకులను భయపెట్టిన సాయి ధరంతేజ్ సీక్వెల్ తో ఏ విధంగా భయపెట్టబోతాడు అనేది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక మరి సీక్వెల్లో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తారా లేక వేరే అమ్మాయిని తీసుకుంటారా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version