VISWAM Theatrical Trailer: టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ 32 గా వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరికెక్కుతున్న ఈ సినిమాని చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉండడంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, యాక్షన్ మేలవింపుగా ఈ సినిమా రూపొందుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.