వాల్తేరు వీరయ్య స్క్రీనింగ్ ఆలస్యం.. థియేటర్‌ అద్దాలు పగలగొట్టిన ఫ్యాన్స్

-

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్‌ సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. డోంట్ స్టాప్ షౌటింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. తమ అభిమాన హీరో చిత్రాన్ని వీక్షించేందుకు తెల్లవారుజాము నుంచే అభిమానులు థియేటర్ల ఎదుట బారులు తీరారు.

అయితే, గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీలక్ష్మీ థియేటర్‌లో ఓ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున బెనిఫిట్‌ షో చూసేందుకు థియేటర్‌ వద్దకు భారీగా అభిమానులు తరలి రాగా.. సాంకేతిక లోపంతో సినిమాని ప్రదర్శించలేకపోతున్నామని సిబ్బంది ప్రకటించింది.

ఎంతోసేపు వేచి ఉన్నా సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వాళ్లు మరింత ఆగ్రహానికి లోనై థియేటర్‌ అద్దాలు పగలగొట్టారు. థియేటర్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. అభిమానులను అక్కడి నుంచి పంపించి వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version