ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’’.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్..?

-

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ‘వాల్తేరు వీరయ్య చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాల్లో ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కన్ఫర్మ్‌ చేసుకున్న రెండో చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. అజిత్‌ నటించిన ‘తునివు’ కూడా ఫిబ్రవరి 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌వేదికగానే స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ విషయానికొస్తే శుత్రిహాసన్‌ కథానాయికగా నటించిన ఈ మూవీలో రవితేజ కీలక పాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version