వామ్మో: కమెడియన్ అలీ ఆస్తి విలువ అన్ని కోట్లా..?

-

ప్రముఖ కమెడియన్ గా హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవైపు సినిమాలలో అడపాదడపా నటిస్తూనే.. మరొకవైపు పలు సెలబ్రిటీ షోలు చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన ఎక్కువగా పూరి జగన్నాథ్ నటించిన సినిమాలలోని పాత్రల ద్వారా బాగా పాపులర్ సంపాదించుకున్నారు. ఇక ఇటీవల వచ్చిన ఎఫ్ 3 సినిమాలో కూడా తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఆయన సినీ ప్రస్థానంలో సుమారుగా 1200కు పైగా సినిమాలలో నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు . అలీ ముఖ్యంగా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాదు మహమ్మద్ భాషా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆలీ కష్టాల్లో ఉన్న వాళ్లకు తన వంతు సహాయం చేస్తూ వస్తున్నారు.

అలీ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. మొత్తం 850 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఇక సంవత్సరానికి ఆయన సంపాదన 20కోట్ల రూపాయలు ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మళ్ళీ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సెలబ్రిటీ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మరింత ఎక్కువ అభిమానం అని చెబుతూ ఉంటారు ఆలీ.

ఇకపోతే తన షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలను, ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అలీ.. రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసిన ఈయన వైసీపీ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా నిలిచారు. ఇకపోతే ఈయన ఎంత డబ్బు సంపాదించినా సరే అందులో కొంత భాగం పేదలకు ఇస్తాడనడంలో సందేహం లేదు. ఇక ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆదుకున్నది అలీ నే కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version