పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కాగా, హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోలను నిర్వహించారు. ప్రీమియర్ షోలలో ఈ సినిమాకు రూ. 30 కోట్ల కలెక్షన్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో భాగంగా వెల్లడించారు. అయితే అంకెలు తనకు ముఖ్యం కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. చరిత్రలో జరిగిన కొన్ని విషయాలను ఈ సినిమాలో ప్రస్తావించినట్లుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమా అనేది కథను చెప్పడానికి గొప్ప మాధ్యమమని అన్నారు.
సోషల్ మీడియాను ఉపయోగించడం తనకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందులో సరైన బ్యాలెన్స్ ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ లో భాగంగా వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ మరో సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా కూడా తొందరలోనే థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.