నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. దాదాపు నెలరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. వర్షాలు బాగా పడాలని అలాగే పసిడి పంటలు పండాలని కోరుతూ ఈ బోనాల పండుగను నిర్వహిస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అయితే ఈ నేపథ్యంలోనే.. ఈ బోనాల పండుగ సందర్భంగా మహిళ పోలీసులు తీన్మార్ స్టెప్పులు వేశారు.

బోనాల పండుగ ముగింపు వేడుకల్లో అదిరిపోయే డ్యాన్సులు వేస్తూ రచ్చ చేశారు తెలంగాణ మహిళా కానిస్టేబుళ్లు. నెల రోజుల నుంచి సెలవులు లేకుండా బందోబస్తు విధుల్లో పోలీసులు పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే బోనాల పండుగ ముగింపు ఉన్న నేపథ్యంలో చివరి రోజు రిలాక్స్ అవుతూ డాన్స్ చేశారు మహిళా పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఫుల్ జోష్ తో స్టెప్పులేసిన మహిళా పోలీసులు..
బోనాలు ముగింపు వేడుకల్లో అదిరిపోయే డాన్స్
నెల రోజుల నుంచి సెలువులు లేకుండా బందోబస్తు విధుల్లో పోలీసులు
బోనాలు ముగియడంతో చివరి రోజు రిలాక్స్ అవుతూ డాన్స్ చేసిన మహిళా పోలీసులు pic.twitter.com/sKFYU5R3nG
— BIG TV Breaking News (@bigtvtelugu) July 25, 2025