ఏంటీ.. సుమ అంత పని చేసిందా..వార్నీ..!

-

ప్రముఖ యాంకర్ సుమ గురించి.. ఆమె సీనియారిటీ గురించి.. వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాస్త జోరు తగ్గించినా కూడా ఆమె ఏ మాత్రం క్రేజ్ తగ్గించుకోలేదని చెప్పాలి. యాంకరింగ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈమె ఏ ఇంటర్వ్యూ చేసినా.. ఏ ఫంక్షన్కు అటెండ్ అయినా కచ్చితంగా అది సక్సెస్ అవ్వాల్సిందే అంతలా పేరు దక్కించుకుంది సుమ. ముఖ్యంగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో అనర్గలంగా మాట్లాడగలదు. ఇదిలా ఉండగా తాజాగా ట్రోలింగ్ కి గురవుతోంది ఈ ముద్దుగుమ్మ.

అసలు విషయంలోకి వెళితే.. సుమ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన భర్త రాజీవ్ నుంచీ ఆమె విడాకులు తీసుకోబోతుందని అందుకే విడిగా ఉంటున్నారు అంటూ కూడా రూమర్స్ గట్టిగా వ్యాపించాయి. అయితే ఇందులో నిజం లేదు అని ఆమె కొట్టిపారేశారు. ఇకపోతే ఈ వార్తలు రోజు పెరిగిపోతుండడంతో టైం దొరికితే చాలు తన భర్తతో కలిసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది . మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్న సుమ తాజాగా కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను , పచ్చళ్ళను ప్రమోట్ చేస్తూ ఒక యాడ్ చేసింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా నటించాడు.

దీనిపైన ప్రస్తుతం జనాలలో వ్యతిరేకత వస్తోంది. ఎందుకంటే అవి వాడాము అని, అవి మంచివి కాదు అని ,డెలివరీ చేసే లోపల పాడైపోతున్నాయని, ప్యాకింగ్ కూడా సరిగ్గా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు అలాంటి వాటిని ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ కూడా సుమాపై ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇప్పటికే చాలా సంపాదించారు కదా ఇక డబ్బు కోసం ఇలాంటివి మీరు ఎలా ప్రమోట్ చేస్తారు మిమ్మల్ని నమ్మి చాలా మంది వాటిని కొనుగోలు చేసి నష్టపోతున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి దీనిపై సుమ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version