డింపుల్ నా అధికారిక వాహనాన్ని ఢీ కొట్టింది – రాహుల్ హెగ్డే

-

డింపుల్ నా అధికారిక వాహనాన్ని ఢీ కొట్టిందని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ఇవాళ డింపుల్‌ హయాతీపై కేసు నమోదు కాగా.. ఆ వివాదంపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. గత కొన్నిరోజులుగా డింపుల్ హయతి కార్ ని మా కారు అడ్డంగా పెడుతుందని.. మా డ్రైవర్ చెప్పినా వినకుండా కారును కాలుతో తన్నిందని ఫైర్‌ అయ్యారు. నేను కూడా ఒకసారి చెప్పినా… తాను వినకుండా రిపీట్ చేసిందని మండిపడ్డారు.

మా కారు తన్ని, ఢీకొట్టింది.. దీంతో మా డ్రైవర్ జూబ్లీహిల్స్ పీఎస్ లో కాంప్లెయింట్ చేశాడని వివరించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.. సీసీ ఫ్యూటేజ్ లో కూడా తాను కాలుతో తన్నినట్లు, ఢీకొట్టినట్లు ఉందన్నారు రాహుల్‌ హెగ్డే. ఆమెపై నాకు పర్సనల్ గా ఎలాంటి గొడవ లేదు.. ఆమె కారు పై చలాన్లు ఉన్నట్లు నాకు తెలియదన్నారు. డింపుల్ హాయతీ, నేను ఒక అపార్ట్ మెంట్ లొనే ఉంటున్నాం.. నేను పార్క్ చేసే స్థలం లో తన కారుకు ఆమె అడ్డు పెడుతుంది.. నేను పోలీస్ కాబట్టి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version