నితిన్ భీష్మ `వాట్టే బ్యూటీ` సాంగ్ ప్రోమో భ‌లేగా ఉందే..!

-

నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. గత ఏడాది శ్రీనివాస కళ్యాణం, ఛల్ మోహన్ రంగ లాంటి నిరాశాజనకమైన ఫలితాలు ఎదుర్కొన్న నితిన్ ప్రస్తుతం ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్నాడు. అయితే ఇప్ప‌టికే గ్లింప్స్, టీజర్, సాంగ్ అంటూ హల్ చల్ చేసిన భీష్మ.. మరోసారి రచ్చ చేసేందుకు వ‌చ్చాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ సాంగ్‌ ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘వాట్టే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే ఆడ్నే రోటీ.. తిప్పూ తుంటే నడుమే నాటి..’ అంటూ సాగిన ఈ సాంగ్ లో నితిన్, రష్మిక అదరగొట్టారు.

 

అలాగే నితిన్‌, ర‌ష్మిక కాస్టుమ్స్, డ్యాన్స్ స్టెప్పులు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. ఫిబ్రవరి రెండో తేదీన సాయంత్రం 4.05 గంటలకు లిరికల్ వీడియోను విడుదల చేస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ చిత్రానిన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పెట్టిన ‘సింగల్ ఫరెవర్’ అనే క్యాప్షన్ చూస్తుంటే నేటితరం యువతకు ఓ సరికొత్త కథను పరిచయం చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version