బాలానగర్ లో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం

-

బాలానగర్ లో పెను విషాదం చోటు చేసుకుంది. బాలానగర్ లోని ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. బాలానగర్ లోని జలగం సాయి సత్య శ్రీనివాస్ ఇంటిలో మంటలు చెలరేగడంతో, అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక ఈ సంఘటన బాలానగర్‌ లో కలకలం రేపుతోంది. పటాన్ చెరు రుద్రారంలోని ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నాడు సత్య శ్రీనివాస్.

Jalagam Sai Satya Srinivas died on the spot after a fire broke out in his house in Balanagar

ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతున్నారు పోలీసులు. శ్రీనివాస్ ఆత్మహత్య పాల్పడ్డారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version