నటోరియాస్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పై 100 కేసులు !

-

గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ అరెస్ట్‌ అయ్యాడు. ప్రిజం పబ్‌ దగ్గర పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు దొంగ. కాల్పుల్లో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికు, ఓ బౌన్సర్‌కు గాయాలు అయ్యాయి. ఈ తరుణంలోనే… దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అని సమాచారం అందుతోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం అని పోలీసులు చెబుతున్నారు.

Serial Burglar Battula Prabhakar Arrested After Shootout at Prism Pub

బత్తుల ప్రభాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని సమాచారం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కళాశాలల్లో కోట్ల రూపాయల నగదు కొట్టేసాడు బత్తుల ప్రభాకర్. రాజమండ్రి, రాజానగరం, భీమవరం, విజయవాడ లో మొత్తం 10 చోరీలు చేశాడు. అన్ని కేసుల్లో కలిపి 5 కోట్ల నగదుతో పరార్ అయ్యాడు. బెంజి కారులు, బ్రాండెడ్ బట్టలు, ఫ్లైట్ లలో జర్నెలతో హైఫై లైఫ్ అనుభవిస్తున్నాడు ప్రభాకర్. విజయవాడ రామవర ప్పాడు కళాశాల లో గత ఏడాది డిసెంబర్ లో 82 లక్షలు చోరీ జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version