మీడియా ప్రతినిధులు ప్రభాస్ ఎదురైనప్పుడల్లా సార్ మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తూనే ఉంటారు.దీంతో ప్రభాస్ అసౌకర్యంగా భావించడం ఎన్నో సందర్భాల్లో కనిపించింది.అయినా వారు ప్రశ్నిస్తూనే ఉంటారు.ఈ క్రమంలో తాజాగా మరోమారు మరోమారు పెళ్లిపై ప్రశ్నను ప్రభాస్ ఎదుర్కొన్నాడు.అనుష్క శెట్టి కి, ప్రభాస్ కు మధ్యలో లవ్ ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.అదేమీ లేదు అంటూ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కొట్టిపడేశారు.తాము మంచి స్నేహితుల మంటూ ఇరువురు స్పష్టం చేశారు.దీంతో ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి ఎవరా?అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఈ క్రమంలో ఓ వార్తా సంస్థతో ప్రభాస్ మాట్లాడిన సందర్భంగా పెళ్లి ప్రస్తావన వచ్చింది.ఎక్కడికి వెళ్లిన తనను దీనిపైనే అడుగుతూ ఉంటారు అని ప్రభాస్ చెప్పారు.దీన్ని పట్టించుకుంటారా?అని అడగ్గా..లేదని ఆయన బదులిచ్చారు.నా వివాహం గురించి అడిగినప్పుడు నాకేమీ చిరాకు అనిపించదు.ఇది సాధారణ ప్రశ్నె.మీ స్థానంలో నేను ఉన్నా దీనిపై నాకు ఆసక్తి ఉంటుంది అని చెప్పారు.త్వరలో వివాహం చేసుకోబోతున్నారా? అన్న ప్రశ్నకు” దీనికి సమాధానం నా వద్ద ఉన్నప్పుడు తప్పకుండా ప్రకటిస్తా” అంటూ ప్రభాస్ పెద్దగా నవ్వేశారు.దీంతో ఆయన పెళ్లి కోసం అభిమానులు మరింత కాలం వేచి చూడక తప్పేట్లు లేదు.