మహేష్ తల్లిదండ్రులు మరణించినా తల వెంట్రుకలు తీయకపోవడానికి కారణం..?

-

ఓకే ఏడాది మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి, తండ్రి కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఒకే ఏడాదిలో వరుసగా మహేష్ బాబు ఇంట్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యం కారణంగా మరణించగా ఆయన తల్లిదండ్రులు ఒకే ఏడాదిలో రోజుల వ్యవధిలో మరణించడంతో మహేష్ బాబు వారి అంత్యక్రియలు , కర్మకాండలు అన్నీ దగ్గరుండి పూర్తి చేశారు. ముఖ్యంగా తల్లికి , తండ్రికి మహేష్ బాబు తలకొరివి పెట్టారు. అయితే మహేష్ బాబు తన తల్లిదండ్రులు మరణించిన సరే తలనీలాలు మాత్రం తీయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు మరణిస్తే తలనీలాలు కొడుకులు సమర్పించి.. కర్మకాండలన్నీ పూర్తి చేస్తారు. అయితే ఈనెల 15న కృష్ణ మరణించడం జరిగింది. పెద్ద కుమారుడు రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో మహేష్ తండ్రి.. రమేష్ బాబు చితికి నిప్పంటించారు. అయితే రెండు సందర్భాలలో మహేష్ తల వెంట్రుకలు తీయలేదు. దీంతో కారణం ఏమిటి అని జనాలు ఇప్పుడు దీనిపై బాగా చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. అయితే మహేష్ బాబు తల వెంట్రుకలు తీయకపోవడానికి కారణం ఆయన రాబోయే సినిమాలనీ తెలుస్తోంది. ఇప్పుడు జుట్టు తీసేస్తే పూర్తి స్థాయిలో పెరగడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది.

ఇప్పటికే మహేష్ బాబు తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా ఆల్రెడీ సెట్ పై ఉన్న విషయం తెలిసిందే. అందుకే మహేష్ బాబు గుండు చేయించుకోలేదని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు మహేష్ బాబు గుండు గీయించుకోకపోవడానికి మరొక కారణం కూడా ఉందట . నిజానికి ఆయన జుట్టు పూర్తిస్థాయిలో ఒరిజినల్ కాదు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. చాలా సహజంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవడం జరిగింది. అంతేకాదు ఆయన గ్లామర్ ఐకాన్ గా అందరూ చెప్పుకుంటారు. అలాంటి మహేష్ ఇప్పుడు జుట్టు తీస్తే మాత్రం విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని.. తలనీలాలు తీయించుకోవడానికి ఇష్టం ఉన్నా.. జుట్టు మాత్రం తీయలేకపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version