పవన్‌ కల్యాణ్‌ను వాడుకుని చంద్రబాబు.. వదిలేస్తాడు – ఆర్కే రోజా

-

చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌ను వాడుకుని వదిలేస్తాడు. పవన్‌ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని మంత్రి ఆర్కే రోజా సూచనలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలపై పవన్‌ కల్యాణ్‌కు అవగాహన లేదు. చంద్రబాబు, పచ్చ ఛానెళ్ల డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ నడుస్తున్నాడని ఫైర్‌ అయ్యారు.

చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌కు వాడుకుని విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడులు చేయించాడు. ఇప్పటంలో అక్రమ నిర్మాణాల విషయంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కోర్టు సమయాన్ని వృథా చేసిన 14 మందికి మనిషికి లక్ష చొప్పున న్యాయస్థానం జరిమానా విధించిందన్నారు.

ఇప్పటం విషయంలో పవన్‌కు ఇంతకంటే పెద్ద దెబ్బ మరొకటి ఉండదు. ఇప్పటంలో పోటీ చేసేది చంద్రబాబు కొడుకు లోకేశ్‌. అయితే, లోకేశ్‌ వెళ్లాల్సిన చోటుకు పవన్‌ కల్యాణ్‌ ఎందుకు వెళ్లాడు? పవన్‌ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి. పవన్ కల్యాణ్‌ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఫుల్ టైమ్ ప్రజల్లో ఉండాలి. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి డ్రామాలు చేయాలనుకుంటే ప్రజలు నమ్మరని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version