మెగా హీరో సినిమా ఆగిపోయింది.. రీజ‌న్ ఏంటి…!

-

మెగాస్టార్ రెండో అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరుకు గ‌తంలో సూప‌ర్ హిట్ సినిమా టైటిల్‌గా ఉన్న విజేత‌తో ఎంట్రీ ఇచ్చిన క‌ళ్యాణ్ ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. చిరంజీవి అల్లుడు క‌దా, రెండో అవ‌కాశం కూడా ఈజీగానే వ‌చ్చింది. ‘సూప‌ర్ మ‌చ్చీ’ సినిమాతో మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

సూప‌ర్ మ‌చ్చీ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా ఇటీవ‌లే వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు 40 శాతం  జ‌రిగింది. అయితే ఈ సినిమా ఆగిపోయింద‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రిజ్వాన్ నిర్మాత‌. పులివాసు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు ముందుగా కొంత పెట్టుబ‌డి అనుకుని స్టార్ట్ చేశార‌ట‌.

ఇప్పుడు 40 శాతం షూటింగ్ అయ్యేట‌ప్ప‌టికే పెట్టుబ‌డి అయిపోవ‌డంతో ఇప్పుడు సినిమాకు ముందుకు క‌దిలించే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. పైగా ఈ నిర్మాత తీసిన ‘తిప్ప‌రా మీసం’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఆడితే ఆ లాభాలు తీసుకువ‌చ్చి ఈ సినిమాలో పెడ‌దామ‌ని అనుకున్నారు. ఇప్పుడు తిప్ప‌రా మీసం ప్లాప్ అవ్వ‌డంతో నిర్మాత చేతులు ఎత్తేశాడంటున్నారు.

అయితే చిరంజీవి అల్లుడు సినిమా ఆగిపోతే బాగోదు.. తొలి సినిమా అట్ట‌ర్ ప్లాప్‌. ఇక రెండో సినిమా మ‌ధ్య‌లో ఆగిపోతే ఇబ్బందే. అందుకే ఈ సినిమాను ఎవ‌రో ఒక‌రు టేక‌ప్ చేస్తార‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news