‘ సాహో ‘ రిజ‌ల్ట్ ఎందుకు తేడా కొట్టింది…!

-

ప్ర‌భాస్ – సుజిత్ కాంబినేష‌న్లో వ‌చ్చిన హైవోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సాహో భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చింది. సినిమాకు ఉన్న హైప్‌తో పోలిస్తే అంత మంచి టాక్ రావ‌డం లేద‌న్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. భారీ బ‌డ్జెట్‌, భారీ కాస్టింగ్‌, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్, పాన్ ఇండియా సినిమా ఇలా అన్ని ప్ల‌స్‌లు ఉన్నా సినిమా రిజ‌ల్ట్ ఎందుకు తేడా కొట్టిన‌ట్టు ఉంద‌న్నది పెద్ద చ‌ర్చ‌గా మారింది. డైరెక్ట‌ర్‌గా ఎలాంటి అనుభ‌వం లేక‌పోయినా… యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌లు తీసుకునే సుజీత్ రన్‌ రాజా రన్‌ లాంటి చిన్న సినిమా చేసి కొంత అనుభవం సంపాదించుకున్నాడు.


కేవ‌లం ఒక్క సినిమా అనుభవం ఉన్న‌ సుజీత్ చేతిలో ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం అంటే రిస్క్‌ అనే చెప్పాలి. భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌, జాతీయ స్థాయి సినిమా… ఇంత ప్రెజర్‌ను హ్యాండిల్ చేయటంలో సుజీత్ తడబడ్డాడు. ప్రభాస్‌ను కేవ‌లం స్టైలిష్‌గా, హాలీవుడ్ స్టార్‌లా చూపింటం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన దర్శకుడు కథా కథనాల విషయంలో ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు.

సినిమాలో యాక్ష‌న్ డామినేట్ చేసినా.. అది కూడా మ‌రీ అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఏదో అబూదాబీ ఎపిసోడ్ మిన‌హా సాహోలో మ‌రీ అంత గొప్ప యాక్ష‌న్ లేదు. ఎమోష‌న్లు, కామెడీ, రొమాంటిక్ ట్రాక్ వీటి గురించి మాట్లాడుకోవ‌డానికేంలేదు. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఒక రొటీన్‌ క్రైమ్‌ ఫార్ములా కథను ఎంచుకున్నా… ప్ర‌తి రోల్‌కు ఓ స‌బ్ ప్లాట్ పెట్టేసి బాగా విసిగించేశాడు.

పాటలు బాగున్నా అవి కూడా క‌థ‌కు ప‌దే ప‌దే అడ్డు త‌గిలాయి. క్లైమాక్స్ బాగున్నా అప్ప‌టికే స్లో నెరేష‌న్‌తో సినిమా అంతా నీర‌సంతో కంటిన్యూ అవ్వ‌డంతో అప్ప‌టికే ప్రేక్ష‌కులు విసుగెత్తిపోయారు. సినిమా చూసిన వాళ్లు నిజంగా రూ.350 కోట్ల ఖర్చు పెట్టారా ? అంటే సందేహ‌మే క‌లుగుతుంది. సినిమా అంతటా భారీతనం కనిపిస్తుంది కానీ.. ఆ బడ్జెట్ కు తగ్గ ఔట్ పుట్ అయితే కనిపించదు. ఫైన‌ల్‌గా హంగులు ఎక్కువై విష‌యం త‌క్కువైపోవ‌డంతో సాహో తేలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news