చంద్రముఖి-2 జవాన్ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా..?

-

తాజాగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా.. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం జవాన్.. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదలై ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.129 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి.. సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఎన్నో పెద్ద పెద్ద పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి.. కానీ ఈ రేంజ్ లో ఏ ఒక్క సినిమా కూడా ఈ రికార్డ్స్ ను అందుకోలేదని చెప్పవచ్చు. బాహుబలి సినిమాను మొదలుకొని ఇటీవల వచ్చిన ఆది పురుష్ సినిమా వరకు ఏ సినిమా కూడా ఈ ఫీట్ టచ్ చేయలేదని చెప్పాలి . దీంతో సినిమా ఆల్ రౌండ్ రికార్డుగా నిలిచిందని చెప్పవచ్చు.

ఈ సినిమా తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న చిత్రం చంద్రముఖి 2. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో దాదాపు 14 సంవత్సరాల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రాఘవా లారెన్స్ రజినీకాంత్ పాత్ర పోషిస్తూ ఉండగా.. జ్యోతిక పాత్రలో చంద్రముఖిగా భయపెట్టడానికి కంగనా రనౌత్ సిద్దం అయింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగగా ఈ సినిమా జవాన్ రికార్డులను బ్రేక్ చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

అయితే అభిమానుల అంచనాలను చంద్రముఖి 2 ట్రైలర్ తలకిందులు చేసిందని చెప్పాలి. ట్రైలర్ చూసిన వాళ్లంతా కూడా సినిమాపై అంచనాలను పూర్తిగా వదులుకున్నారు. ట్రైలర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా జవాన్ రికార్డులను బ్రేక్ చేస్తుందా అంటే కష్టమే అని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news