చిరంజీవితో సినిమా చేస్తా : సందీప్ రెడ్డి వంగా

-

అర్జున్ రెడ్డి యానిమల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సందీపు తాజాగా యూఎస్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి సినీ ప్రియులను కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు. ఇందులో భాగంగా తనకు చిరంజీవితో కలిసి వర్క్ చేయాలనే ఉందని చెప్పారు. అవకాశం వస్తే తప్పకుండా చిరంజీవితో యాక్షన్ డ్రామా తరకెక్కిస్తాను అన్నారు.

ఇప్పటివరకు జరిగిన చర్చ కార్యక్రమంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే..n సినిమాకు సంబంధించి ఎన్నో విషయాల గురించి నన్ను అడిగారు. నా ఇష్టం తెలుసుకున్నారు కానీ స్త్రీ ద్వేషం పై ఒక్కరు కూడా నన్ను ప్రశ్నించలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమాలాగే చూశారు. అందుకు నేను సంతోషంగా ఉన్నానని చెప్పారు. కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్లో తెరకెక్కించిన చిత్రమే యానిమల్. ఇందులో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే మాట్లాడుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version