పవన్ తో చేయవలసిన సినిమా ఈ హీరో తో చేస్తే సక్సెస్ అవుతుందా..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ హీరోగా పేరుపొందాడు సత్యదేవ్. తాజాగా గోపి గణేష్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం గాడ్సే. ఈ సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారని డైరెక్టర్ తెలియజేశారు. గాడ్సే కథను పవన్ తో చేయాలనుకున్నను కానీ ఆయన తో చేయలేకపోయానని కనీసం సినిమా అయినా ఆయనకు చూపించాలనుకున్నానని తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఈ నెల 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గోపి గణేష్ తెలియజేశారు. అందుకోసం ఈ సినిమా ప్రమోషన్ లో కూడా బాగానే పాల్గొంటున్నారు.

ఇక సత్యదేవ తో కలసి ఆల్రెడీ బ్లాక్ మాస్టర్ అనే సినిమా తెరకెక్కించారు గోపీ గణేష్ ఇప్పుడు తాజాగా మరొకసారి గాడ్సే అనే సినిమాతో మెప్పించాలని చూస్తున్నారు. ఇందులో సత్య ఒక కామన్ మ్యాన్ పాత్రలో నటించబోతున్నారు. సినిమాను ప్రతి కామన్ మ్యాన్ బాగా కనెక్ట్ అవుతారు అనే నమ్మకం తమ చిత్ర బృందానికి ఉందని తెలియజేశారు డైరెక్టర్ గోపి గణేష్. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా బాగా అద్భుతంగా చూపించారట.

ప్రస్తుతం చదివిన చదువులకు కేవలం ఆరు శాతం మాత్రమే ఉద్యోగం చేస్తున్నారని పాతికేళ్ల పాటు జీవితాన్ని పణంగా పెట్టి చదివితే దాని ఫ్యూచర్ ప్రయోజనం లేకపోవడంతో ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాలని డైరెక్టర్ గోపి గణేష్ వెల్లడించడం జరిగింది. మరి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ సత్యదేవ్ ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ కు రాసుకున్న ఈ కథ సత్యదేవ్ ను స్టార్ డమ్ సంపాదించుకునేలా చేస్తుందేమో తెలియాలి అంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇక సత్యదేవ్ చిరంజీవితో కూడా కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు గా సమాచారం. ఏది ఏమైనా చిన్న చిన్న సినిమాల నుండి స్టార్ హీరోల వరకు బాగా పేరు సంపాదించారు సత్యదేవ్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version