వామ్మో.. సమంత రేంజ్ మరీ ఇంతనా.?

-

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పలు యాడ్ లలో పనిచేసిన ఈమె ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకొని.. ఆ తర్వాత తన నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలలోనే కాదు కోలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. అంతే కాదు హిందీలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్న ఈమె హాలీవుడ్ లో కూడా ఇప్పుడు అవకాశాలు సొంతం చేసుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత మరొకవైపు పలు ఇంటర్నేషనల్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే తాను తాజాగా టామీ హిల్ ఫిగర్ యాడ్ లో నటించినది. ఇకపోతే ఈ యాడ్లో సమంత కాస్త బొద్దుగా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు. మయోసైటీస్ వ్యాధి బారిన పడిన ఈమె చాలా బక్క పల్చగా మారిపోయి అనారోగ్య సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి బయటపడిన ఈమె తాజాగా ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన టామీ హిల్ ఫిగర్ రిస్ట్ వాచ్ బ్రాండ్స్ కి ప్రమోటర్గా మారింది.

ఇకపోతే ఈ యాడ్ కోసం సమంత భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వాణిజ్య ప్రకటనలలో సమంత నటించడం ఇదేమి కొత్త కాదు.. హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కూడా ఆమె ఇలాంటివి ఎన్నో చేసింది.. అయితే ఇప్పుడు ఈమె రేంజ్ పెరిగిపోయిన నేపథ్యంలో ఈ యాడ్ కోసం ఏకంగా రూ .3కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోందని సమాచారం. అంటే స్టార్ హీరోలు కూడా యాడ్స్ కోసం ఈ రేంజ్ లోనే పారితోషకం తీసుకుంటున్నారు. ఇప్పుడు వారికి దీటుగా తనకు ఉన్న నేషనల్ వైడ్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటోంది సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version