వామ్మో.. ప్రభాస్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్ ఖరీదు అన్ని కోట్లా..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ ఇక నేషనల్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి అత్యధిక పారితోషకం తీసుకునే హీరోగా నెంబర్ వన్ స్థానాన్ని ప్రభాస్ చేరుకోవడం గమనార్హం. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో చాలామంది వచ్చిన పారితోషకాన్ని అలాగే పలు యాడ్స్ ద్వారా, పలు వాణిజ్య ప్రకటనల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో పెడుతూ మరింత ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కూడా తాను సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఫామ్ హౌస్ ల రూపంలో పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన పెట్టుబడి మొత్తం 2 ఫామ్ హౌస్ ల రూపంలో పెట్టానని, ఆ రెండు ఫామ్ హౌస్ లు కూడా సిటీ ఔట్స్కట్స్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే సిటీ బయట ఔట్స్కట్స్ లో ప్రభాస్ నిర్మించుకున్న ఫామ్హౌస్ ఖరీదు అక్షరాల 60 కోట్ల రూపాయలు. ఇక షూటింగ్ లేక ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఆయన ఎక్కువ సమయం ఈ ఫామ్ హౌస్ లోనే గడుపుతారట . అంతేకాదు ఈ ఫామ్ హౌస్ లో ఎక్కువగా చెట్లు, పండ్లతోటలు , కూరగాయల తోటలు అతిపెద్ద స్విమ్మింగ్ ఫూల్ ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేకాదు ఎప్పుడైనా తన స్నేహితులతో , బంధువులతో పార్టీ , వెకేషన్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభాస్ ఎక్కువగా ఈ ఫామ్ హౌస్ ను ఉపయోగిస్తారట.

మరొక ఫామ్ హౌస్ విషయానికి వస్తే ప్రభాస్ పుట్టిన ఊరు అయిన భీమవరంలో సుమారుగా 84 ఎకరాలలో విస్తరించి ఉన్నట్లు సమాచారం. అందులో కొంత భాగం వృధాగా వదిలిపెట్టగా, మరికొంత భాగంలో పండ్లతోటలు, మరికొంత భాగంలో కూరగాయల తోటలు, మరికొంత భాగంలో పూల తోటలు ఇలా రకరకాలుగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేకాదు వీటికోసం ప్రత్యేకంగా కొంతమందిని పని కోసం నియమించి వారికి ఉపాధి కల్పించారట ప్రభాస్. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ప్రాపర్టీ విలువ రూ. కోటి 82 లక్షల రూపాయలుగా తేలింది. ఇక ప్రస్తుతం దాని విలువ చూసుకుంటే వెలకట్టలేనిది అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news