ఏపీలో రిజిస్ట్రేషన్లు రోడ్డెక్కాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సంతకాలు చేయాల్సిన అధికారులు నడిరోడ్డుపై చేయడం ప్రజలకు విస్తుకలిగిస్తుంది. టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై సబ్ రిజిస్టార్ సంతకాలు చేసిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. ఓ టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై కదిరి సబ్ రిజిస్టార్ శ్రీనివాసులు సంతకాలు చేశారు. కార్యాలయంలోని తన ఛాంబర్లో సంతకాలు చేయాల్సిన అధికారి ఇలా హోటల్లో, రోడ్ల మీద కూర్చొని సంతకాలు చేయడం ఏమిటని స్థానికులు, తోటి అధికారులు ప్రశ్నిస్తున్నారు.దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు.. టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సబ్ రిజిస్టార్
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్న కదిరి సబ్ రిజిస్టార్ శ్రీనివాసులు
కార్యాలయంలోని తన ఛాంబర్లో కూర్చొని సంతకాలు చేయాల్సిన అధికారి ఇలా… pic.twitter.com/bMKqxEXvX4
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2025