గుజరాత్లో లోయలో పడిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

-

గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

రాష్ట్రంలోని డాంగ్ జిల్లాలోని నాసిక్-గుజరాత్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. సపుతర ఘాట్ రోడ్డులో బస్సు వెళ్తుండగా అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడిపోయినట్లు స్థానికులు వెల్లడించారు.బాధితులు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై గుజరాత్ ప్రభుత్వం స్పందిస్తూ.. మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news