మమ్ముట్టితో సినిమా నా అదృష్టం

-

దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో యాత్ర మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మళయాళ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. నేటితో యాత్రలో మమ్ముట్టి పోర్షన్ పూర్తి కావడంతో ఆయనకు బై బై చెబుతూ ఆయన గురించి పొగుడుతూ ట్వీట్ చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్.

390 సినిమాల అనుభవం.. 3 నేషనల్ అవార్డులు.. 60 మంది డెబ్యూ డైరక్టర్స్ కు అవకాశం ఇచ్చిన హీరో ఆయన ఇంకా సాధించాల్సింది ఏది లేదు. వై.ఎస్ పాత్రలో ఆయన తప్ప మరెవరిని ఊహించలేను. ఆయన ఓ అద్భుతం.. తెలుగులో కథ విని.. ప్రతి పదానికి అర్ధం తెలుసుకుని మరి చేశారు. నా గుండె మీద చెయ్యి వేసుకుని చెబుతున్నా ఈ పాత్రలో ఆయన కన్నా ఎవరు బాగా చేయలేదు అంటూ మమ్ముట్టి మీద ఉన్న తన ప్రేమని చూపించాడు మహి వి రాఘవ్.

డిసెంబర్ 21న యాత్ర మూవీ రిలీజ్ ప్లాన్ చేయగా.. సినిమాలో వై.ఎస్ జగన్ పాత్ర ఉండదని తెలుస్తుంది. వైఎస్ హయాంలో జగన్ అంత క్రీయాశీల రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయన పాత్రని స్కిప్ చేశారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news