బుల్లి రాజుపై వైసీపీ సీరియస్.. నీ కెరీర్ ఫినిష్ అంటూ ?

-

విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బుడ్డోడి పాత్రలో చేసిన బుల్లి రాజు పై వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తుంది. హీరో విశ్వక్ నటించిన సినిమాకు… బుల్లి రాజు ప్రమోషన్ వీడియో ఇచ్చారు. కచ్చితంగా లైలా సినిమా చూడాలని జనాలకు పిలుపునిచ్చాడు బుల్లి రాజు.

YCP BULLI RAJU

అయితే ఇదే విషయం వైసిపి కార్యకర్తలకు కోపం తెప్పించింది. లైలా సినిమా బైకాట్ అంటూ… వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో… వాళ్లకు విరుద్ధంగా బుల్లి రాజు వ్యవహరించడం… జగన్మోహన్ రెడ్డి టీంకు కోపం తెప్పించింది. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ సోషల్ మీడియా… బుల్లి రాజు పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతుంది. నీ కెరీర్ ఇక క్లోజ్ రా బుడ్డోడా అంటూ.. వైసిపి సోషల్ మీడియా కామెంట్స్ చేస్తోంది. టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో… విశ్వక్ నటించిన లైలా సినిమాకు యమగండంలా మారింది వైసిపి సోషల్ మీడియా.

Read more RELATED
Recommended to you

Latest news