వామ్మో బడ్జెట్ పెంచేసిన యంగ్ హీరో రామ్..ఎన్ని కోట్లంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇటీవల పాన్ ఇండియా సినిమాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలోని సినిమా బడ్జెట్ పరిమితులను కూడా దాటేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే క్రేజ్ కి మించి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఒక్కో స్టార్ హీరో కూడా తన సినిమా బడ్జెట్ ను ఏకంగా రూ.100 కోట్ల నుండి రూ.200 కోట్లకు మించి పెంచడం గమనార్హం. పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడిన నేపథ్యంలో ప్రతి స్టార్ హీరో కూడా బడ్జెట్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ తమ సినిమాలను కూడా ప్లాన్స్ చేసుకుంటూ మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు. ఇక యంగ్ హీరో రామ్ కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.

రామ్ నటిస్తున్న ది వారియర్ సినిమాకి ఏకంగా 75 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బడ్జెట్టు అనుకున్న దానికంటే ఎక్కువ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా రామ్ తీసే ప్రతి సినిమా కూడా రూ. 25 కోట్ల లోపే బడ్జెట్ ఉంటుంది. కానీ ఇస్మార్ట్ శంకర్ రూ. 50 కోట్లు కలెక్షన్ వసూలు చేయడంతో అదే స్థాయిలో బడ్జెట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు కానీ ఏకంగా రూ. 75 కోట్లకు అంటే మూడింతలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక శాటిలైట్ రైట్స్ వస్తాయనుకున్నా బడ్జెట్ రికవరీ అంత అయితే కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు కూడా.ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చేస్తున్న సినిమాకి ఏకంగా వంద కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలో ట్రేడ్ వర్గాలు ఎలా స్పందిస్తాయో తెలియాల్సి ఉంది.