ఐపీఎల్ 2022లో చెన్నై చాప్టర్ క్లోజ్ అయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకున్న ముంబై చేతిలో చెన్నై ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లను కోల్పోయి 14.5 ఓవరల్లో 103 పరుగులు చేసిన విజయం సాధించింది.
తిలక్ వర్మ 34 రాణించగా.. రోహిత్ శర్మ 18 పరుగులు, షోకీన్ 18 పరుగులు, డేవిడ్ 16 పరుగులు చేసి.. ముంబైని విజయ తీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 3 వికెట్లు, సిమర్ జిత్ సింగ్, మొయిన్ అలీ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 97 పరుగులకే కుప్పకూలింది. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ ఎంఎస్ ధోని 36 మినహా ఎవరూ రాణించలేదు. దీంతో ముంబై కి 98 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అయితే.. ఈ లక్ష్యాన్ని ముంబై… ఐదు వికెట్లను కోల్పోయి 14.5 ఓవరల్లో ఛేదించింది.