విజయ్‌ దేవరకొండపై అసభ్యకర వీడియో.. యూట్యూబర్‌ అరెస్ట్‌

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండపై ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో అసభ్యకర వీడియోను అప్‌లోడ్‌ చేశారు. దీనిపై విజయ్‌ టీమ్‌ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యూట్యూబర్‌ను అరెస్ట్‌ చేశారు.

Vijay Devarakonda will give a gift of Rs

ఇదీ జరిగిన విషయం.. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి విజయ్‌ దేవరకొండను కించపరిచే విధంగా వీడియోలు క్రియేట్‌ చేసి తన యూట్యూబ్‌ ఛానల్లో అప్‌లోడ్‌ చేశాడు. విజయ్‌నే కాకుండా ఆయనతో పాటు మరో నటిని కూడా ఆ వీడియోల్లో అసభ్యకరంగా చూపించాడు. ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి. వీటిని చూసిన విజయ్ ఫ్యాన్స్ తెగ ఫైర్ అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని విజయ్ టీమ్ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ వీడియోలను గమనించిన విజయ్ దేవరకొండ టీమ్ సదరు యూట్యూబ్ ఛానల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు యూట్యూబర్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం అతడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఆ వీడియోలను డిలీట్‌ చేయించారు. మరోసారి అవాస్తవాలను, తప్పుడు వార్తలను ప్రచారం చేసినా.. అసభ్యకర వీడియోలు వైరల్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అతడిని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version