హనీమూన్ ఎక్స్ప్రెస్ కి టాలీవుడ్ మన్మధుడు….

-

దర్శకుడు బాల రాజశేఖర్ 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్. హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుంది. కళ్యాణ్ మాలిక్ ఈ సినిమాకి సంగీత దర్శకునిగా పనిచేస్తున్నాడు. తనికెళ్ల భరణి మరియు సుహాసిని కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే కింగ్ నాగార్జున ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను బిగ్ బాస్ సెట్ లోని ప్రత్యేకమైన “కింగ్ “రూమ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ బాల నాకు ఎంతో సుపరిచితమైన వ్యక్తి అని అన్నపూర్ణ స్టూడియో కి డీన్ గా వ్యవహరిస్తూ హాలీవుడ్ కి చెందిన సినిమా పరిజ్ఞానాన్ని తమ విద్యార్థులకు అందజేశారని తెలిపాడు.

ఈ సినిమా ఎంతో వినోదాత్మకంగా ఉంటుందని కళ్యాని మాలిక్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారని తెలిపాడు. దర్శకుడు బాల మాట్లాడుతూ తాను హాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో పని చేశానని తనకి ఎప్పటికైనా ఒక తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాలని కోరిక ఉండేదని అన్నాడు. అక్కినేని అమల గారి ప్రోద్బలంతోనే తాను టాలీవుడ్ లో కి అరంగేట్రం చేశానని చెప్పాడు. అలాగే ఈ సినిమా పోస్టర్ని రిలీజ్ చేసిన నాగార్జున కి కృతజ్ఞతలు తెలిపాడు

Read more RELATED
Recommended to you

Latest news