శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతిరూపమని పేర్కొంటారు. అంతేకాదు చిన్నచిన్న సామెతలలో అంటే రాముడు మంచి బాలుడులా ఎన్నో ఉన్నాయి. రామ రాజ్యం రామ రాజ్యం అంటుటే విన్నాం కానీ మనం చూడలేదు.. మరి రామ రాజ్యం అంతలా గొప్పగా వెలుగొందేందుకు కారణం ఆ నీలిమేఘశ్యాముని సుగుణాలే. అసలు రాముడికి రామాయణంలో చెప్పిన గుణగణాలు ఎవో మీకు తెలుసా…
రాముడికి 16 సుగుణాలు ఉన్నాయని ప్రశస్తి. అవి ఏంటో చూద్దాం…
గుణవంతుడు, విద్యావంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యభాషి, దృఢ, నిష్టకలవాడు, సదాచారయుతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రిదర్శనుడు, మనోనిగ్రహం కలవాడు, క్రోధం లేనివాడు, అసూయలేనివాడు, రణభయంకరుడు, కాంతిమంతుడు. అందుకే రాముడ్ని సకల గుణ సంపన్నుడు అంటారు.
– శ్రీ