ప్రతి ఒక్కరికి శనేశ్చ్వరుడు అంటే భయం, భక్తి. జీవితంలో ఏదో ఒక్కసారి ప్రతి మనిషి శని మహర్దశ, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు వస్తాయి. వీటి పరిహారం కోసం తప్పక శని ప్రదక్షణలు చేస్తారు. అయితే సర్వ సాధారణంగా చాలామందికి ఒక సందేహం నవగ్రహాలు అందులో శనికి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఏం చేయాలి? పక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్లవచ్చా? వెళ్లకూడదా? వంటి అనేక సందేహాలు. ఈ సందేహాలకు పలు శాస్ర్తాలలో పలు మార్గాలు చెప్పబడ్డాయి.
- శని గ్రహానికి ప్రదక్షిణలు చేసిన తర్వాత తప్పక కాళ్లు కడుగుకొని పక్కనే ఉన్న శివాలయం లేదా విష్ణు లేదా అమ్మవారు లేదా ఆంజనేయస్వామి దేవాలయంలో మరల కనీసం మూడు ప్రదక్షిణలు చేసి అక్కడ తీర్థం తీసుకుని ఇంటికి వెళ్లాలి.
- ఒకవేళ శనిదోష పరిహారం కోసం శనిత్రయోదశి పూజ, తైలాభిషేకం చేయించుకుంటే సాధ్యమైనంత వరకు ఆ దుస్తులపై నుంచి స్నానం చేయడం, అవకాశం ఉంటే ఆ దుస్తులను పారవేసి, వెంట తీసుకువెళ్లిన మరో దుస్తులను ధరించి పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షిణం చేసి తీర్థం తీసుకోవాలి.
- ఒకవేళ శనిత్రయోదశి లేదా తైలాభిషేకం చేసిన తర్వాత స్నానం చేయడానికి ఎట్టి అవకాశం లేకుంటే కనీసం కాళ్లు, ముఖం కడుగుకొని, ఆచమనం చేసి పక్కనే ఉన్న దేవతామూర్తులకు ప్రదక్షిణ చేసి తీర్థం తీసుకుని ఇంటికి వెళ్లాలి. ఇంట్లో తప్పక ఆ దస్తులను మార్చుకుని స్నానం చేసి ఇంట్లో దేవునికి నమస్కారం చేసుకుని తర్వాత ఏదైనా పని చేసుకోవచ్చు.
- ఇక నవగ్రహాలకు సాధారణంగా ప్రదక్షిణ చేసిన తర్వాత తప్పక కాళ్లుచేతులూ కడుగుకొని పక్కనే ఉన్న ఏ దేవతలకైనా ప్రదక్షిణ, తీర్థం తీసుకోవడం ఉత్తమం అని పండితులు పేర్కొంటున్నారు.
- ఇక తెలిసింది కదా శనికి ప్రదక్షిణం చేస్తే, పూజ చేస్తే ఆచరించాల్సిన ప్రక్రియలు. పెద్దలు చెప్పిన విధానంలో ఆచరించి ఉత్తమ ఫలితాలు పొందండి.
- – కేశవ