అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం.. గర్భంలో శిశు మరణం!!

-

పురాణాల్లో అస్ర్తాల గురించి చాలాసార్లు విన్నాం. ఘోరమైన తపస్సు చేసి వరంగా పొందిన అస్ర్తాలను ఆయా యుద్ధాల్లో వాడిన సందర్భాలు అనేకం. అలాంటి అస్ర్తాలలో బ్రహ్మాస్త్రం ఒకటి. నేడు అణుబాంబులంటే ఎంత తీవ్రమైనవో అంతకంటే ఘోరమైనది ఈ బ్రహ్మాస్త్రం. దీన్ని అనేక యుద్ధాల్లో ఆయా వీరులు వాడారు. ఇక మహాభారతంలో బ్రహ్మాస్త్ర విద్య తెలిసినవారు ద్రోణుడు, అర్జునుడు, అశ్వత్థామ తదితరలు ఉన్నారు. అయితే వీరిలో బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఉపసంహారం తెలిసినవారు ద్రోణార్జునులు. ఇక అశ్వత్థామ విషయానికి వస్తే అస్త్రప్రయోగం తెలుసుకాని ఉపసంహారం తెలియదు. అదే భారతయుద్ధంలో ఒక మలుపు తిప్పిన ఘటన.


భారత యుద్ధంలో దుర్యోధనుడు తీవ్రగాయాలు అయిన తర్వాత అశ్వత్థాముడు, కఋపాచార్యుడు తదితరులు దుర్యోధుని వద్దకు వస్తారు. ఆ సమయంలో పాండవులను సంహరించి వస్తానని ప్రతిజ్ఞచేస్తాడు అశ్వత్థాముడు. అదేరోజు రాత్రిపూట స్వామి భక్తితో అశ్వత్థామ పాండవుల సైన్య శిబిరంలో చాలామందిని చంపివేస్తాడు. దానిలో ఉపపాండవులు కూడా ఉంటారు. అంటే పాండవుల కొడుకులు, మనవలు. మరుసటి రోజు ఉదయాన ఈ విషయం పాండవులకు తెలుస్తుంది. అప్పుడు భీముడు అశ్వత్థామను చంపడానికి సిద్ధమయి వెళ్తాడు. కానీ అశ్వత్థామ అస్త్ర నిపుణుడు భీముని సంహరించగలడని తెలిసి ధర్మార్జున, నకులలను తోడు తీసుకుని భీముడు, అశ్వత్థాములు యుద్ధం చేసే దగ్గరికి వెళ్తారు. అది గమనించిన అశ్వత్థాముడు అర్జునుని యుద్ధంలో ఓడించడం కష్టమని భావించి బ్రహాస్ర్తాన్ని ప్రయోగించాడు. వెంటనే కఋష్ణుని ఆదేశంతో అర్జునుడు కూడా బ్రహాస్ర్తాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు దివ్యాస్ర్తాలు ఆకాశాన పోరాడుచుండెను.

నారద, వేదవ్యాసుల ఇద్దరికి అస్ర్తాలను ఉపసంహరించుకోమని ఆజ్ఞాపిస్తారు. అర్జునుడు ఉపసంహరించాడు.కానీ ఉపసంహారం తెలియని అశ్వత్థామ ఏమి చేయలేదు. దీంతో అది ఉత్తర గర్భంలో శిశువును సంహరిస్తుంది. వెంటనే శ్రీకఋష్ణుడు ఆ శిశువును తన శక్తితో బతికిస్తాడు. పరిరక్షించబడిన ఉత్తర శిశువే పరీక్షుత్తు. తదనంతర కాలంలో ధర్మరాజు తర్వాత హస్తినాపురాన్ని ఎలి మహారాజుగా కీర్తిగడించాడు. ఇక ఆ యుద్ధంలో అర్జునుడు విజఋంభించి అశ్వత్థామను ఘోరంగా ఓడిస్తాడు. గురువు పుత్రుడు కాబట్టి సంహరించకుండా కఋష్ణుని ఆదేశం ప్రకారం శిరోముండనం చేసి ఆయన తల్లి దగ్గర పడవేస్తారు పాండవులు. ఇదండి బ్రహ్మాస్త్ర ప్రయోగం- శాపం- తదనంతర పరిణామాలు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version