ఇలా కార్తీక మాసంలో దీపం పెట్టారంటే.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కచ్చు..!

-

అప్పుల సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నారా? అయితే ఇలా చేయడం మంచిది. అప్పులు లేకుండా ఉంటే జీవితం బాగుంటుంది. ఎంతో సంతోషంగా సాగుతుంది. హ్యాపీగా ఉండొచ్చు. ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అప్పుడప్పుడు డబ్బులు లేక కొంత మంది అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు కట్టేయొచ్చులే అనుకుంటారు. ఎక్కువ అప్పులు చేయడం వలన ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంటారు. అప్పుల నుంచి బయటపడడానికే కార్తీకమాసంలో కందుల దీపం పెడితే మంచిది. కార్తీకమాసంలో ఈ దీపం ఎలా పెట్టాలి..? ఎలాంటి ఫలితం పొందవచ్చు అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

కార్తీక మాసంలో దీపారాధన ఎంతో విశిష్టమైనది. కందుల దీపాన్ని వెలిగిస్తే మాత్రం అప్పుల నుంచి బయటపడవచ్చు. ఒక మంగళవారం నాడు కందుల దీపాన్ని కార్తీకమాసంలో వెలిగిస్తే రుణ బాధల నుంచి గట్టెక్కొచ్చు. ఇంటిని శుభ్రం చేసుకుని శుభ్రంగా స్నానం చేసి పూజగదిని కూడా అందంగా అలంకరించుకోండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం తీసుకుని బొట్లు పెట్టాలి ఫోటో ఎదురుగా మీరు ఒక పీఠ వేసి పసుపు రాయాలి. దానిపై బొట్లు పెట్టండి.

పీట మీద బియ్యం పిండి తో ముగ్గు వేయండి. ఆ తర్వాత ఓ పళ్లెంలో కేజీ ఎర్ర కందిపప్పు పోయాలి. రెండు ప్రమిదలకి బొట్లు పెట్టి ఆ కందిపప్పు పై వాటిని పెట్టి నువ్వుల నూనె పోసి ఎర్ర వత్తులు వేయాలి. 9 వత్తులు తీసుకుని ఒక వత్తి కింద చేయాలి. ఒకవేళ ఎర్రని వత్తులు మీకు దొరకకపోతే మామూలు వత్తులకి కుంకుమ రాయండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ కందులని నానబెట్టి.. అందులో బెల్లం కలిపి గోమాతకి పెట్టాలి. లేకపోతే మీరు వీటిని ఎవరికైనా ఇచ్చేయొచ్చు. ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version