తిరుమలలో ఎందుకు స్త్రీలు పూలు పెట్టుకోకూడదు..? కారణం ఏంటంటే..?

-

తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది తిరుమల వెళ్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తారు. తిరుమల కొండపైన కొన్ని నియమాలని తప్పక పాటించాలి. వాటిలో ముఖ్యమైనది పుష్పాలంకరణ. తిరుమలకు వెళ్లే భక్తులు పూలు పెట్టుకోకూడదు. ఏంటి ఈ రూల్ అని ఆలోచిస్తున్నారా…? నిజమే వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్లేటప్పుడు పూలు పెట్టుకోకూడదట. తిరుమలకు వెళ్ళేటప్పుడు కచ్చితంగా ఈ విషయాన్ని మహిళలు గుర్తుపెట్టుకోవాలి.

tirumala

వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు. కొండపై పూసిన ప్రతి పువ్వు వెంకటేశ్వర స్వామికి చెందాలి అనేది భక్తుల విశ్వాసం. కొండపైన అందుకే ఎవరు పూలు పెట్టుకోరు. పురాణాలలో ఇంకో కథ కూడా ఉంది. ప్రాచీన కాలంలో వెంకటేశ్వర స్వామి అలంకరణకి ఉపయోగించే పూలని భక్తులకు ఇచ్చేవారు. వాటిని పరమ పవిత్రంగా భావించి భక్తిశ్రద్ధలతో పెట్టుకునేవాళ్ళు. ఓసారి శ్రీశైలం పూర్ణుడు అనే ఒక పూజారి శిష్యుడు స్వామి అలంకరణకి వాడాల్సిన పూలని తాను అలంకరించుకోవడానికి ఉపయోగించాడు.

తర్వాత వెంకటేశ్వర స్వామి ఆ పూజారి కలలో కనిపించారు పరిమళ ద్రోహం చేశాడని కన్య చేసేసాడు. తర్వాత శ్రీశైలం పూర్ణుడు ఎంతగానో బాధపడ్డాడు. అప్పటినుంచి కొండపైన ఉన్న పూలన్నీ వెంకటేశ్వర స్వామికి చెందాలని నియమం పెట్టారు. అలాగే స్వామివారికి ఉపయోగించిన పూలను ఎవరికి ఇవ్వకుండా బావిలోనే వేసే ఆచారం కూడా వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version